అనన్య న్యూస్, మహబూబ్ నగర్: సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి ద్వారా ప్రజలు అందించిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి.రవి నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించబడిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజలు రెవెన్యూ, సర్వే ల్యాండ్ రికార్డ్స్ శాఖ, పంచాయతీ రాజ్, స్త్రీ శిశు,సంక్షేమ శాఖ, ఎస్.సి అభివృద్ది శాఖ ఇతర శాఖలకు సంబంధించిన దరఖాస్తులు అంద చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ధరణి పెండింగ్ దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలని తహశీల్దార్ లను ఆదేశించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ ప్రతి రోజు టెలీ కాన్ఫరెన్స్ ద్వారా పెండింగ్ దరఖాస్తుల పురోగతి సమీక్షిస్తారని అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ యస్.మోహన్ రావు, డి.అర్.ఓ కె.వి.వి.రవి కుమార్, జడ్పి సి.ఈ.ఓ రాఘవేంద్ర రావు, డి.అర్.డి.ఓ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
MBNR: ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్..
RELATED ARTICLES