- రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బండి విజయ్ కుమార్..
అనన్య న్యూస్, మహబూబ్ నగర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని టిడబ్ల్యూజెఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బండి విజయ్ కుమార్ లు అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా కమిటీ అధ్యక్షులు వాకిట అశోక్ కుమార్, కార్యదర్శి గోపాల్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైనా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవ పున్నయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో మీడియాకు గడ్డుకాలం ఏర్పడిందన్నారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులు గాని అర్హులైన ప్రతి జర్నలిస్ట్ కు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జర్నలిస్ట్ లకు బిపిఎల్ కోటాలో డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇండ్ల స్థలాల పట్టాలు జర్నలిస్టుల కోటా కింద ఇవ్వాలని కోరారు. అదేవిధంగా రైల్వే పాసులు పునరుద్ధరించాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్ట్ లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. ఇతర రాష్ట్రాల తరహాలో జర్నలిస్టులకు రిటైర్మెంట్ పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకి అక్రిడికేషన్ కార్డులు ఇప్పించిన ఘనత టిడబ్ల్యూజేఎఫ్ దే అన్నారు. జర్నలిస్టులకు రక్షణ చట్టం తేవాలని డిమాండ్ చేశారు. స్థానిక సమస్యలపైన జిల్లా ప్రత్యేక దృష్టి పెట్టి పట్టుదలతో సమస్యలను తీర్చాలని జిల్లా కమిటీని కోరారు. జర్నలిస్ట్ లకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రైల్వే పాస్ రాయితీనీ రద్దు చేసిందని తెలిపారు. భవిష్యత్తులో టిడబ్ల్యూజేఎఫ్ సభ్యత్వాన్ని పెంచి అతిపెద్ద సంఘంగా ఏర్పాటు కోసం కృషి చేయాలని జిల్లా కమిటీనీ కోరారు.
రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బండి విజయ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణలో ప్రభుత్వాలు మారినా జర్నలిస్ట్ ల స్థితి గతులు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు. ఎలక్షన్లలలో ఎన్నో వాగ్దానాలు ఇచ్చి నేడు ప్రభుత్వాలు జర్నలిస్ట్ లను మోసం చేస్తున్నారన్నారు. జిల్లాల కమిటీలను బలోపేతం చేయాలని సభ్యత్వాలు పెంచాలని కోరారు. మూడు నియోజక వర్గాల వారీగా బాధ్యతలు పంచుకొని మండలాల వారీగా ఫెడరేషన్ ను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
జిల్లా అధ్యక్షులు వాకిట అశోక్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో జిల్లాలలో నేడు ఫెడరేషన్ ఒక్కటే జర్నలిస్ట్ ల సమస్య లపై పోరాటం సాగిస్తున్నదని తెలిపారు. ఏన్ని ప్రభుత్వాలు మారినా ఎంతమంది నాయకులు మారినా సరే ఒక్క సారి అధికారం లోకి వస్తె బినామీల. పేర్ల 100 ల ఎకరాలు.. వేల కోట్ల ఆస్తులు సంపాదిస్తారనీ ఆరోపణలు ఎన్నో ఉన్నాయి. జర్నలిస్ట్ లకు మాత్రం జర్నలిస్ట్ కోటాలో స్థలాల పట్టాలు ఇచ్చి రాజకీయం చేస్తారని మండి పడ్డారు. జర్నలిస్ట్ లకు ఇచ్చిన హెల్త్ కార్డులు కూడ ఏ కార్పోరేట్ ఆసుపత్రి లో పని చేయడం లేదని ఆయన గుర్తు చేశారు. జర్నలిస్ట్ లకు రక్షణ చట్టం కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కార్యదర్శి మొలకల పల్లి గోపాల్ కారదర్శి మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లాలో ఫెడరేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ ల అనేక సమస్యల పై సంఘం పోరాటాలు చేసినట్లు తెలిపారు. జిల్లాలో బలమైన సంఘం గా టిడబ్ల్యూజెఎఫ్ ను నిర్మాణ పరంగా రాబోయే కాలంలో ప్రతి జర్నలిస్ట్ పని చేయాలనీ పిలుపు నిచ్చారు. జిల్లాలో అనేక సమస్యలు నెలకొని ఉన్నాయని తెలిపారు.
ఐఎఫ్డబ్ల్యూజె నాయకులు ఉమా మహేశ్వర్ రావు మాట్లాడుతు జర్నలిస్ట్ లకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించాలని, సంఘం బలోపేతం కోసం జర్నలిస్ట్ లు కృషి చేయాలని కోరారు., జిల్లా సీనియర్ జర్నలిస్ట్ నాయకులు మంగళగిరి యాదగిరి మాట్లాడారు. జిల్లా లో ఫెడరేషన్ అభివృద్ధి కోసం పలు సూచనలు, సలహాలు చేశారు. రాష్ట్ర కమిటీ సభ్యులు ఎండి రఫీ, జిల్లా వర్కింగ్ ప్రసిడెంట్ గండీటి నరసింహ, కోశాధికారి ఎం.వేణు గోపాల్, ఉపాధ్యక్షులు సి. ఆనంద్, సంయుక్త కార్యదర్శులు ఎం. దాసు, జీ.రామకృష్ణ, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు పసుపుల శ్రీనివాస్, ప్రచార కార్యదర్శి రాంమోహన్, జిల్లా నాయకులు రామకృష్ణా రెడ్డి, మోహన్ గౌడ్, జీ. ఆనంద్, భాస్కర్, నరసింహలు, తదితరులు జర్నలిస్ట్ లు పాల్గొన్నారు.