అనన్య న్యూస్, మహబూబ్ నగర్: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రి లో ఐ.సి.యు, పురుషుల, స్త్రీల శస్త్ర చికిత్స వార్డ్,ఇంజెక్షన్ వార్డ్,దంత విభాగం, అల్ట్రా సౌండ్ స్కానింగ్ రూం, సెంట్రల్ లేబరెటరీ, డీ ఆడి క్షన్ సెంటర్, గైనకాలజీ విభాగం, వార్డలను కలియతిరిగి పరిశీలించారు. ఆసుపత్రి డాక్టర్ లు, రోగులతో మాట్లాడారు. ఆసుపత్రి లో విధులు నిర్వర్తించే డాక్టర్ లు, వైద్య సిబ్బంది హాజరు, మానిటరింగ్ ఎలా చేస్తున్నారు అని ఆసుపత్రి సూపరింటెండెంట్ ను అడిగి తెలుసుకున్నారు. ఆధార్ ఆధారిత బయో మెట్రిక్ విధానం ద్వారా డాక్టర్ లు, ఆసుపత్రి వైద్య సిబ్బంది హాజరు నమోదు చేస్తున్నట్లు కలెక్టర్ కు ఆయన వివరించారు.
డీ అడిక్షన్ సెంటర్ లో సైకి యాట్రి విభాగంలో డాక్టర్ లు, సిబ్బంది గురించి, ఇక్కడ ఎటువంటి కేసులు వస్తాయి తెలుసుకున్నారు. గైనకాలజీ విభాగం లో రోజు ఎంత మంది వస్తున్నారు. ఎటువంటి కేసులు వస్తున్నాయి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ను అడిగి తెలుసుకున్నారు. నేరుగా వచ్చే రోగులతో పాటు, పి.హెచ్.సి, సి.హెచ్.సి నుండి రిఫర్ చేసిన కేసులు వస్తాయని తెలిపారు. ప్రస్తుతం ఉన్న 450 బెడ్ లు ఉండగా రోగుల సంఖ్య పెరిగినందున పారిశుధ్య, సెక్యూరిటీ సిబ్బంది సంఖ్య పెంచాలని కలెక్టర్ ను కోరారు.
ఎస్.ఎన్.సి.యు విభాగంలో డెలివరీ తర్వాత శ్వాస సమస్య, తక్కువ బరువు, నెలలు ముందు జన్మించిన శిశువులకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఆసుపత్రి లో అవసరమైన సదుపాయాల కోసం ప్రతి పాదనలు సమర్పించాలని కలెక్టర్ సూపరింటెండెంట్ ను ఆదేశించారు. కలెక్టర్ తో పాటు ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.జీవన్, గైనాకాలజీ హెడ్ డా.రాధ, అర్.ఎం.ఓ లు డా.దుర్గ, డా. శిరీష, డా.భాస్కర్ నాయక్, సి.హెచ్. ఓ రాము నాయక్, ఆసుపత్రి అభివృద్ది కమిటీ సభ్యులు సాదత్ అలీ తదితరులు ఉన్నారు.