అనన్య న్యూస్, మహబూబ్ నగర్: ఆనాడు బహుజనుల కష్టాలు తీర్చిన వీరుడు, బహుజనుల ఆశాజ్యోతి పండుగ సాయన్న అని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రములో పండుగ సాయన్న విగ్రహ ఏర్పాటు కార్యక్రమం బుధవారం అట్టహాసంగా జరిగింది. బహుజన వీరుడు పండుగ సాయన్న విగ్రహాన్ని మహబూబ్ నగర్ ఎంపి డికె అరుణ, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, కాంగ్రెస్ రాష్ట్ర నేత నీలం మధు ముదిరాజ్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరై సాయన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని ఆదుకుని వారి పాలిట దేవుడిగా మారిన మహనీయుడు పండుగ సాయన్న అని కొనియాడారు. పండుగ సాయన్న చరిత్ర కేవలం జానపద రూపంలో సంవత్సరాల కాలం నిలిచిపోయిందంటే ఆయన గొప్పతనం ఏమిటో ఇట్టాగే తెలిసిపోయిందన్నారు. చేసిన సేవలు అందించిన సహకారం తరతరాలుగా నిలిచిపోతుందంటే ఇటువంటి ఘటనలు వెలుగులోకి వచ్చినప్పుడే అందరికీ తెలుస్తుందని, ముదిరాజ్ సామాజిక వర్గం బహుజనులకు సహాయ సహకారాలు అందించి వారి అభివృద్ధికి ఎంతగానో కృషి చేయాలని సూచించారు.
మన్నెంకొండ దేవస్థానం వద్ద పండుగ సాయన్న 25 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి వివరించారు. అలాగే ప్రభుత్వంతో చర్చించి ఎకరా స్థలంలో పండుగ సాయన్న స్మృతి వనం నిర్మిస్తామన్నారు.
కార్యక్రమంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, మాజీ మంత్రి పి. చంద్రశేఖర్, ఎన్ పి వెంకటేష్, టిపిసిసి ప్రదాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్, సత్తూరు చంద్రకుమార్ గౌడ్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, బెక్కం జనార్ధన్, మారేపల్లి సురేందర్ రెడ్డి, బుద్దారం సుధాకర్ రెడ్డి, పెద్ద విజయ్ కుమార్, లక్ష్మణ్ యాదవ్, మహేందర్, కృష్ణయ్య పండుగ సాయన్న విగ్రహావిష్కరణ కమిటీ అధ్యక్షుడు పల్లెమోని యాదయ్య, గోపాల్, మైత్రి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.