అనన్య న్యూస్, మహబూబ్ నగర్: గణేష్ మండపాల నిర్వాహకులు పోలీస్ నియమాలు కచ్చితంగా పాటించాలని, పోలీస్ శాఖ వెబ్ ఫోర్టల్ లో వివరాలను నమోదు చేసుకోవాలని జిల్లా ఎస్పీ కే నరసింహ తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ పోలీసు శాఖ వారు రూపొందించిన గణేష్ మండపం నిర్వహణకు సంబంధించిన ఆన్ లైన్ ఇన్ఫర్మేషన్ అనేది మండపం నిర్వహణ, మండపముకు సంబంధించిన సమాచారం కొరకు రూపొందించిందని, గణేష్ ఉత్సవాల నిర్వాహకులు గణేష్ విగ్రహాలను వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేయుటకు ముందు, ముందస్తు సమాచారం పోలీసు స్టేషన్ లో ఇవ్వాలని అందుకోసం అన్ లైన్ అప్లై చేసుకోవాలని అన్నారు. http://policeportal.tspolice.gov.in అనే సైట్ నందు వివరాలు పొందు పరచి అప్లికేషన్ ను సంబంధిత పోలీస్ స్టేషన్ నందు అందించాలని సూచించారు. సామాజిక మాధ్యమాలలో వచ్చే ఎలాంటి రూమర్స్, వదంతులను నమ్మకూడదని ఎవ్వరికైన ఎలాంటి సందేహాలు ఉన్న సంబంధిత పోలీసు వారికి లేదా డయల్ 100 లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ 8712659360 కు సమాచారం అందించలని సూచించారు. గణేష్ ఉత్సవాలను అందరు ఆనందోత్స వాల మధ్య శాంతియుతంగా నిర్వహించుకోవాలని సూచించారు.
MBNR: పోలీస్ నియమాలు పాటించాలి: ఎస్పీ కే. నరసింహ..
RELATED ARTICLES