అనన్య న్యూస్, మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎంఎల్‌సి ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. గురువారం ఎం.పి.డి.ఒ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. నాగర్ కర్నూల్‌లో ఎంఎల్‌సి కూచకుల దామోదర్ రెడ్డి, ఫరూక్‌నగర్‌లో ఎంఎల్‌ఎ వీర్లపల్లి శంకర్ లు ఓటు వేశారు. ఈ ఎన్నికల్లో జడ్‌పిటిసిలు, ఎంపిపిలు, ఎంపిటిసిలు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులైన1,439 మంది ఓటర్లుగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది.
ఏప్రిల్ 2వ తేదీన ఎంఎల్‌సి కౌంటింగ్ ఉంటుంది. మొత్తం 1,439 మంది ఓటర్లలో బిఆర్‌ఎస్‌కు మెజార్టీ సభ్యులు దాదాపు 800 దాకా ఉన్నారు. అయితే 3 నెలల క్రితం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో ఈ ఎన్నిక సవాల్‌గా మారనుంది.