అనన్య న్యూస్, మహబూబ్ నగర్: అన్ని కులవృత్తులను ప్రోత్సహించి వృత్తిదారుల జీవితాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణలో కురుమ, యాదవుల సంక్షేమ కోసం ప్రవేశపెట్టిన ఉచిత గొర్రెల పంపిణీ పథకాన్ని దేశమంతా అమలు చేసేందుకు సిఎం కెసిఆర్ ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ కలెక్టరేట్ సమీపంలో ఆదివారం ఏర్పాటు చేసిన రెండో విడత ఉచిత గొర్రెల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మహబూబ్‌నగర్ రూరల్ మండల పరిధిలోని జైనల్లీపూర్, కోడూర్ , మాచన్‌పల్లి గ్రామాలకు చెందిన లబ్దిదారులకు 18 యూనిట్ల గొర్రెలను మంత్రి అందజేశారు.
ఈ సందర్భంగా లబ్దిదారులనుద్దేశించి ఆయన ప్రసంగించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి కులవృత్తులను ఆదుకున్నది సిఎం కెసిఆర్ మాత్రమేనని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, ముడా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మూడా చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ చైర్మన్ కేసి నర్సిములు, సింగిల్‌విండో చైర్మన్ రాజేశ్వర్‌రెడ్డి, ముడా డైరెక్టర్ అంజనేయులు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి, జీజీహెచ్ సలహ మండలి సభ్యుడు సత్యంయాదవ్, పశుసంవర్ధక శాఖ ఏడి వెంకటేశ్వర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.