అనన్య న్యూస్, మహబూబ్ నగర్: ప్రతి కేసులో పారదర్శకంగా పకడ్బందీగా విచారణ చేపట్టాలని ఎస్పి డి. జానకి అన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో శనివారం కోర్టు డ్యూటీ అధికారులు, కోర్టు లైజన్ అధికారులతో ఎస్పి జానకి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో కేసుల విచారణలో పారదర్శకత, వేగం, న్యాయ ప్రక్రియలను సమర్థవంతంగా నిర్వహించేందుకు తీసుకోవలసిన చర్యలపై చర్చించారు. కోర్టు సంబంధిత రికార్డుల నిర్వహణ, సమన్లు, వారెంట్లు అమలు చేయడం, కేసులపై సమయానికి నివేదికలు సమర్పించడం వంటి అంశాలపై అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు. జిల్లా పోలీసుల పనితీరును మెరుగుపరచడానికి అవసరమైన మార్గదర్శకాలు, సలహాలను వివరించారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, డిసిఆర్బి డిఎస్పి రమణా రెడ్డి, వర్టికల్ డిఎస్పి సుదర్శన్ ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
MBNR: ప్రతి కేసులో పారదర్శకంగా విచారణ చేపట్టాలి: ఎస్పి డి. జానకి..
RELATED ARTICLES