- పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంబరాలు..
అనన్య న్యూస్, మక్తల్: మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి ప్రఖ్యాత అమెరికా యూనివర్సిటీ గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయడంపై మక్తల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోయ రవికుమార్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం స్థానిక మక్తల్ పట్టణంలోని అంబేడ్కర్ చౌక్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. అనంతరం మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాకటి శ్రీహరి ఈ పేరు వినగానే రాష్ట్ర ప్రజలకు మక్తల్ శాసనసభ్యుడు అని తెలుసు కానీ మక్తల్ చుట్టుపక్కల గ్రామాల వారికి శ్రీహరి అంటే తోటి కుటుంబ సభ్యుడు, మామ, బాబాయ్, అన్న ఇలా ఏ పేరుతో అయినా పిలుచుకునే హక్కు ఇక్కడ జనాలకి ఉంది. గత కొన్ని ఏళ్లుగా ఆయన రాజకీయ జీవితంలో సర్పంచి గా, జెడ్పిటిసి గా, ప్రస్తుతం ఎమ్మెల్యేగా పదవులు చేపట్టిన ప్రజలకు మాత్రం ఆపదలో ఆదుకునే ఆపద్బాంధవుడుగానే టక్కున గుర్తుకు వస్తాడు.
సాధారణ కుటుంబంలో పుట్టిన వాకిటి శ్రీహరి కష్టపడే నైపుణ్యం, పట్టుదల, నిబద్ధతతో ఉన్నత శిఖరాలను చేరుకున్నారు. చిన్నతనం నుండి ఎదుర్కొన్న సవాళ్లను సమర్థవంతంగా అధిగమిస్తూ, ఆయన ఎంతో స్ఫూర్తిదాయకంగా ఎదిగారు. ప్రజల సమస్యలను తెలుసుకొని వాటికి పరిష్కారాలు కనుగొనే నిబద్ధతతో వాకిటి శ్రీహరి మక్తల్ నియోజకవర్గంలో ఒక ప్రభావవంతమైన నాయకునిగా గుర్తింపు పొందారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆయన నేతృత్వంలో విజయవంతంగా అమలు చేయబడ్డాయి. ప్రజల పట్ల ఆయన చూపించే సేవా భావం, నిస్వార్థ ధోరణి ఆయనను ప్రత్యేక నాయకునిగా నిలిపాయి.
వాకిటి శ్రీహరి విద్యాసాధన, విద్యా రంగంలో గ్రామీణ ప్రాంతాల్లో విద్యా అవకాశాలు కల్పించడం, సాంఘిక సమానత్వం, వైద్యం, మహిళా సాధికారత, పేదలకు సాయం చేయడంలో ఆయన చూపిన కృషి ప్రశంసనీయమైనది. అనేక సామాజిక కార్యక్రమాల్లో ఆయన పాత్ర ప్రముఖంగా ఉంది. ఆయన మానవతా విలువలు, సమాజానికి అందించిన సేవలు విశేషంగా నిలిచాయి. వారి సమగ్ర జీవితం, ప్రజలకు అందించిన సేవలను గౌరవిస్తూ ప్రతిష్ఠాత్మక అమెరికా గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ ను. 2024 అక్టోబర్ 19న శనివారం పుదుచ్చేరి, తమిళనాడులో జరిగిన అవార్డు ప్రధానోత్సవం కార్యక్రమంలో వాకిటి శ్రీహరిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించారు. ఈ గౌరవం వలన వాకిటి శ్రీహరి కృషికి మరింత గుర్తింపు లభించింది. భవిష్యత్తులో మరిన్ని పురస్కారాలు వాకిటి శ్రీహరికి దక్కాలని మనసారా ఆకాంక్షించారు.
కార్యక్రమంలో కట్ట సురేష్ కుమార్ గుప్తా, బి.గణేష్ కుమార్, వల్లంపల్లి లక్ష్మణ్, గొల్లపల్లి నారాయణ, చెన్నయ్య సాగర్, ఏ. రవి కుమార్, మందుల నరేందర్, కట్ట వెంకటేష్, బోయ వెంకటేష్, కున్సీ నాగేందర్ , కావలి తాయప్ప ,వాకిటి శ్యామ్, గద్వాల్ రవి, కావలి ఆంజనేయులు, అబ్దుల్ రెహమాన్, మహమ్మద్ నూరుద్దీన్, ఫయాజ్, ఉస్సాముద్దీన్, పెద్దింటి మల్లేష్, బహదూర్, మెకానిక్ రాము, దండు వెంకట్ రెడ్డి , బోయ నరసింహ, మంజూరు ఇలాహి, అఫ్రోజ్, పీర్ పాషా, రత్న కుమార్, బండారి శేఖర్, ఆనంపల్లి రమేష్, శేఖర్, నర్సింలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.