- 40 రోజుల్లో చంద్రుడుపై దిగనున్న ల్యాండర్..
అనన్య న్యూస్, సూళ్లూరుపేట: జాబిల్లిపై పరిశోధనల కోసం ఇస్రో తల పెట్టిన ప్రతిష్టాత్మక చంద్రయాన్-3 ప్రయోగంలో తొలి దశ శుక్రవారం విజయవంతంగా పూర్తయింది. జాబిల్లి రహస్యాలను మానవాళికి అందించేందుకు చంద్రయాన్-3 నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. శుక్రవారం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంత రిక్ష పరిశో ధనా కేంద్రం నుంచి ఇస్రో మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషాల 15 సెకన్లకు ప్రయోగించిన ఈ ప్రతిష్టాత్మక శాటిలైట్ 40 రోజుల సుదీర్ఘ ప్రయాణంలో మూడు దశలను దాటుతుంది. సుమారు 3.84 లక్షల కిలోమీటర్ల ప్రయాణంలో తొలి దశను దాటిన రాకెట్ భూకక్ష్యలోకి విజయవంతంగా చేరడం ద్వారా రెండో దశలోకి ప్రవేశించింది. ఈ విక్రమ్ ల్యాండర్ భూ కక్ష్యలో 24 రోజుల పాటు భ్రమణం చెందుతుంది. ఆగస్టు 23 లేదా 24వ తేదీన చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్తో పాటు రోవర్ సైతం దిగుతుంది.
చంద్రుడి ఉపరితల వాతావరణం, చంద్రశిలలు, మట్టి నమూనాలను సేకరించి రిపోర్టులు పంపిస్తుంది. చంద్రయాన్-3లో ల్యాండర్, రోవర్, ప్రొపల్షన్ మాడ్యూల్స్ ఉన్నాయి. దీని బరువు సుమారు 3,900 కిలోగ్రాములు. ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్తుండగా శాస్త్రవేత్తలు కరతాళ ధ్వనులతో సంబరాలు చేసు కున్నారు. 2019లో ప్రయోగించిన చంద్రయాన్-2 పాక్షికంగా విఫలమైన నేపథ్యంలో చంద్రయాన్-3 మిషన్ను ఇస్రో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నాలుగేళ్ల పాటు అవిశ్రాం తంగా కష్టపడి రూపొందించిన రాకెట్ నుంచి దశల వారీగా అన్నీ అనుకున్నట్లే విడి పోయినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.
హైదరాబాద్ లో స్పేర్ పార్ట్స్ తయారీ చంద్రయాన్-3 రాకెట్ తయారీకి కావాల్సిన విడిభాగాలను హైదరాబాద్లోని నాగసాయి ప్రెసేసియన్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తయారు చేసింది. రోవర్, ల్యాండర్, ప్రొపల్షన్ మాడ్యూల్స్ లో బ్యాటరీలు ఏర్పాటు చేసే విడిభాగాలను కూకట్పల్లిలోని ప్రశాంత్ నగర్ లో గల ఎయిర్ స్పేస్ అడ్ ప్రెసిసన్ ఇంజినీర్స్ కంపెనీ తయారు చేసింది.