అనన్య న్యూస్, జడ్చర్ల: విఘ్నాలు తొలగించు వినాయక అంటూ కౌన్సిలర్ చైతన్య చౌహన్ విగ్నేశ్వరుని ప్రార్థించారు. శనివారం వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డ్ విజయనగర్ కాలనీ రోడ్డు నెంబర్ 1 లో లెజెండ్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో నిర్వహించిన మొదటి పూజ కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్ చైతన్య చౌహన్ మహా గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చైతన్య చౌహన్ మాట్లాడుతూ విఘ్నాలను తొలగించే గణనాథుడు ప్రజల కష్టాలను తీర్చాలని, ప్రజల జీవితంలో సంతోషాలు వెల్లివిరియాలని మనసారా ఆ గణనాథుని ప్రార్థించినట్లు తెలిపారు. కార్యక్రమంలో లెజెండ్ యూత్ సభ్యులు, కాలనీవాసులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.
JCL: విఘ్నాలు తొలగించు వినాయక: కౌన్సిలర్ చైతన్య చౌహన్..
RELATED ARTICLES