అనన్య న్యూస్, జడ్చర్ల: కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో భాగంగా ముదిరాజ్ కులస్తులను బిసి-డి నుండి బిసి ఏ లోకి మారుస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం జీవో నెంబర్ 15 ను అమలు చేయాలని తెలంగాణ ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జగన్ మోహన్ ముదిరాజ్ డిమాండ్ చేశారు. ఆదివారం జడ్చర్ల పట్టణంలో జరిగిన ముదిరాజుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో జగన్ మోహన్ ముదిరాజ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థిగా అన్ని పార్టీలు ముదిరాజులకు టికెట్ ఇవ్వాలని, రాష్ట్రంలో 14 పార్లమెంట్ స్థానాల్లో అవకాశం ఉన్న కనీసం ఐదు స్థానాల్లో అయినా ముదిరాజులకు టికెట్లను కేటాయించాలని అన్ని రాజకీయ పార్టీలను డిమాండ్ చేశారు.
అందులో మహబూబ్ నగర్, మేడ్చల్, చేవెళ్ల, మల్కాజ్గిరి, స్థానాల్లో ముదిరాజులకు టికెట్ ఇవ్వాలన్నారు. లేని పక్షంలో గత ఎమ్మెల్యే ఎలక్షన్లలో పరాభవం చూసినటువంటి పార్టీల లాగే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఓడించడం జరుగుతుందన్నారు. ముదిరాజ్ ల అత్యధిక ఓట్లు ఉన్నటువంటి పార్లమెంట్ స్థానాల్లో ముదిరాజులకు అవకాశం ఇవ్వడం లేదని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ముదిరాజ్ కులస్తులకు టికెట్టు ఇవ్వని పార్టీలకు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ముదిరాజుల సత్తా ఏమిటో చూపిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వివిధ మండలాల ముదిరాజ్ సంఘం నాయకులు, ఉమ్మడి జిల్లా కన్వీనర్ ఎడ్ల బాబన్న ముదిరాజ్, మాజీ సర్పంచ్ రేణుక ముదిరాజ్, అనుప కృష్ణయ్య ముదిరాజ్, కాటమోని కిషన్ ముదిరాజ్, రామ్ శ్రీనివాస్ ముదిరాజ్, పిట్టల శ్రీనివాస్ ముదిరాజ్, చెన్నయ్య ముదిరాజ్, గుండు చంద్రమౌళి ముదిరాజ్, లక్ష్మయ్య ముదిరాజ్, వెంకటేష్ ముదిరాజ్, నరసింహ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.