- మహిళల విద్యాభివృద్ధికి కృషి చేసిన మహినీయుడు పూలే: ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి..
అనన్య న్యూస్, జడ్చర్ల: మహిళల విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే అని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి అన్నారు. గురువారం మహాత్మ జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకొని జడ్చర్ల అంబేద్కర్ పూలే చౌరస్తాలో పూలే విగ్రహానికి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ బాలికలను చదివించవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని, ఆస్తుల కన్నా ముఖ్యమైనది చదువు అని గుర్తించాలని అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు చైతన్య చౌహన్, కుమ్మరి రాజు, నాయకులు గుండు చంద్రమౌళి, జగదీష్ చారి, విజయ భాస్కర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు సయ్యద్ మీనాజుద్దీన్, ఎంఏ మాలిక్ షాకీర్, వెంకటేష్, సయ్యద్ ఫహద్, రఘు తదితరులు ఉన్నారు.
- బిఆర్ఎస్ ఆధ్వర్యంలో..

మహనీయుల స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య అన్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకొని జడ్చర్ల అంబేద్కర్ పూలు చౌరస్తాలో ఉన్న పూలే విగ్రహానికి బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య మాట్లాడుతూ సామాజిక పరివర్తకుడు, గొప్ప సంస్కర్త మానవతావాది మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగిద్దామని అన్నారు. మండల అధ్యక్షులు రఘుపతి రెడ్డి, కౌన్సిలర్లు కోట్ల ప్రశాంత్ రెడ్డి, ఉమాశంకర్ గౌడ్, రమేష్, నాయకులు పరమటయ్య, వీరేష్ తదితరులు ఉన్నారు.
- బీసీ సేన ఆధ్వర్యంలో..

మహాత్మ జ్యోతిబా పూలే జయంతిని పురస్కరించుకొని జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో గురువారం జ్యోతిబాపూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జడ్చర్ల మండల పరిధిలోని బూరుగుపల్లి గ్రామంలో బీసీ సేన రాష్ట్ర అధ్యక్షులు బూరుగుపల్లి కృష్ణ యాదవ్ మహాత్మ జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కృష్ణ యాదవ్ మాట్లాడుతూ అవిద్య అజ్ఞానానికి, కుల వైశ్యమ్యాలే కారణమని గ్రహించిన పూలే క్షుద్ర వాడల్లో పాఠశాలలను ఏర్పాటు చేసి అన్నగారిన వర్గాల జీవితాల్లో అక్షర జ్యోతి వెలిగించిన గొప్ప సంస్కర్త పూలే అని ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి, కిషోర్ కుమార్, మల్లేష్ యాదవ్, వేణుగోపాల్ రెడ్డి, రామస్వామి మేస్త్రి, రవికుమార్, కొండల్ యాదవ్, రామస్వామి, యాదయ్య, కుర్మూర్తి, రాజు, పవన్ కళ్యాణ్, దశరథం, నారాయణ, పరమేష్, అశోక్, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.