అనన్య న్యూస్, జడ్చర్ల: నియోజకవర్గ అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తానని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి అన్నారు. జడ్చర్ల మండల పరిధిలోని పలు గ్రామాల్లో, జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.ఈ సందర్భంగా మండల పరిధిలోని పెద్దఆదిరాలలో 35 లక్షలతో వేస్తున్న సీసీ రోడ్డు పనులకు, ఎక్వాయి పల్లి గ్రామంలో 26.70 లక్షలతో వేస్తున్న సిసి రోడ్డు పనులకు, చిన్న ఆదిరాలలో 2 కోట్ల 40 లక్షలతో వేస్తున్న బీటీ రోడ్డు పనులకు, నెక్కొండ గ్రామంలో 70 లక్షలతో నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులకు, గుట్టకాడి పల్లి లో 96 లక్షలతో వేస్తున్న బీటీ రోడ్డు పనులకు, బోయిలకుంట క్రాస్ రోడ్ లో 1. 20 లక్షలతో నిర్మిస్తున్న బీటీ రోడ్డుకు, ఆలూరులో 12 లక్షలతో నిర్మిస్తున్న అంగన్వాడి భవన నిర్మాణానికి, మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డులో 4 లక్షలతో నిర్మిస్తున్న డ్రైనేజీ పనులకు, 27 వ వార్డులో 96 లక్షలతో నిర్మిస్తున్న డ్రైనేజీ పనులకు, శిఖర్ గాన్ పల్లిలో 20 లక్షలతో నిర్మిస్తున్న గ్రామపంచాయతీ భావన నిర్మాణానికి, మర్రిచెట్టు తండాలో 80 లక్షలతో వేస్తున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.
పెద్దఆదిరాల గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఎమ్మెల్యే కానుక అందిస్తున్న షూస్ ను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెద్దఆదిరాల గ్రామంలో 35 లక్షలతో వేస్తున్న సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. అలాగే ఎస్సీ సబ్ ప్లాన్ కింద అదనంగా 25 లక్షల సాంక్షన్ చేయాలని ప్రపోజల్ పెట్టడం జరిగిందన్నారు. మార్చి తర్వాత నియోజకవర్గానికి మరిన్ని నిధులను తీసుకొచ్చి గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపిస్తానని అన్నారు. జడ్చర్ల నియోజకవర్గంలోని ప్రతి తాండలకు లింకు రోడ్లు శాంక్షన్ చేయిస్తానని చెప్పారు. నా హయాంలో 80 శాతం రోడ్లను పూర్తి చేస్తానని తెలిపారు.

గత సంవత్సరం పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం నేడు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు షూను ఉచితంగా అందిస్తున్నామని గుర్తు చేశారు. వచ్చే విద్యా సంవత్సరం షూతో పాటు స్కూల్ బ్యాగ్, వాటర్ బాటిల్ అందజేస్తామని అన్నారు. సిఎస్ఆర్ కార్యకలాపాల ద్వారా నిధులను తీసుకొచ్చి పాఠశాలలను అభివృద్ధి చేస్తానని తెలిపారు. విద్యార్థులు విద్యాభ్యాసాన్ని సక్రమంగా అభ్యసించి మంచి ప్రయోజకులు కావాలని కోరారు. కార్యక్రమాలలో మున్సిపల్ చైర్ పర్సన్ పుష్పలత, మార్కెట్ చైర్ పర్సన్ జ్యోతి రెడ్డి, నాయకులు, కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు.