అనన్య న్యూస్, జడ్చర్ల: కృష్ణా నది జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని వ్యతిరేకిస్తూ బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ నాయకత్వంలో నిర్వహిస్తున్న చలో నల్గొండ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని జడ్చర్ల బిఆర్ఎస్ నాయకులు కోరారు. శనివారం జడ్చర్ల అంబేద్కర్ చౌరస్తాలో ఈ నెల 13న చలో నల్గొండకు సంబంధించిన వాల్ పోస్టర్ ను వారు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కేఆర్ఎంబికి సాగర్, శ్రీశైలం సహ కృష్ణానది మీద ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించి రైతాంగ వ్యతిరేక నిర్లయాలను తీసుకుంటుందని దీనిని ఖండిస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో చలో నల్గొండ భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారని, ఈ సభకు జడ్చర్ల నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, మండల పార్టీ అధ్యక్షులు రఘుపతి రెడ్డి, కౌన్సిలర్లు రఘురాం గౌడ్, శశికిరణ్, నాయకులు రామ్మోహన్, పిట్టల మురళి, కొంగలి జంగయ్య, శంకర్ నాయక్, నర్సింలు, గిరి యాదవ్, కరాటే శ్రీను, సురేష్, ఇంతియాజ్ ఖాన్ తదితరులు ఉన్నారు.