అనన్య న్యూస్, జడ్చర్ల: జడ్చర్ల నియోజకవర్గం ఉప సర్పంచుల సంఘం అధ్యక్షుడు, జడ్చర్ల మండలం కుర్వపల్లి బిఆర్ఎస్ మాజీ ఉప సర్పంచ్ ఆంగోత్ పాండు నాయక్ జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు గంగ్య నాయక్ ఆధ్వర్యంలో మాజీ ఉప సర్పంచ్ ఆంగోత్ పాండు నాయక్, బిఆర్ఎస్ మండల యూత్ ప్రచార కార్యదర్శి ఆంగోత్ సతీష్ నాయక్, వార్డు మెంబర్ జటావత్ విజయ్ నాయక్ తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా పాండు నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని నమ్మి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని, కాంగ్రెస్ ఆరు గ్యారంటీ పథకాలను, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపేడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గోపాల్ నాయక్, మాజీ ఎంపీటీసీ రాంజీ నాయక్, ఆంగోత్ రవీందర్ నాయక్ తదితరులు ఉన్నారు.