అనన్య న్యూస్, జడ్చర్ల: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జడ్చర్ల మున్సిపల్ చైర్ పర్సన్ కోనేటి పుష్పలత అన్నారు. శుక్రవారం అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా జడ్చర్ల అంబేద్కర్, పూలే చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పుష్పలత మాట్లాడుతూ అంబేద్కర్ బహుజనల ఆర్థిక, అసమానతలు రూపు మాపేందుకు కృషి చేశారని అన్నారు.
కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ సారిక , జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ కోడ్గల్ యాదయ్య , పిట్టల మురళి, కౌన్సిలర్లు కోట్ల ప్రశాంత్ రెడ్డి, ఉమాశంకర్ గౌడ్, రఘురాం గౌడ్, లత, చైతన్య, కోనేటి నరసింహులు, రామ్మోహన్, కొండల్, శంకర్ నాయక్, ఇమ్ము, పరమటయ్య, కొంగలి నాగరాజ్, జంగయ్య, సత్యం, అబ్దుల్లా, పార్వతమ్మ, విజయ్, తదితరులు పాల్గొన్నారు.