అనన్య న్యూస్, జడ్చర్ల: స్వాతంత్ర్య పోరాటంలో అసమానమైన తెగువతో దేశానికి స్వేచ్ఛ వాయువులు వీచ్చేందుకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కీలకంగా పనిచేశారని వక్తలు పేర్కొన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 127 వ జయంతి పురస్కరించుకొని మంగళవారం గణేష్ యూత్ సేన ఆధ్వర్యంలో నేతాజీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కావేరమ్మపేట గ్రామచావిడి దగ్గర ఉన్న నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. గణేష్ యూత్ సేన అధ్యక్షులు గోనెల నరేందర్ మాట్లాడుతూ స్వాతంత్ర్యోద్యమంలో సుభాష్ చంద్రబోస్ పోషించిన పాత్ర ఎంతో గొప్పదన్నారు. సైన్యాధ్యక్షుడుగా ఆయన నిర్వర్తించిన విధులు స్ఫూర్తిదాయకమైనవని కొనియాడారు. నేటి యువత నేతాజీని స్ఫూర్తిగా తీసుకొని దేశ సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కౌన్సిలర్ బుక్క మహేష్, నాయకులు బి. కృష్ణారెడ్డి (బికేఆర్), బుక్క లక్ష్మయ్య, గోద తిరుపతయ్య, మల్లేష్, యాదయ్య, బుక్క నర్సింలు, బుక్క శ్రీనివాసులు, శేఖర్, వెంకటయ్య, శివకుమార్, గణేష్ యూత్ సేన సభ్యులు మిద్దె నాగరాజు, బుక్క శివ, గుండు చంద్రశేఖర్, గుండు శ్రీశైలం తదితరులు ఉన్నారు.
