అనన్య న్యూస్, జడ్చర్ల: మున్సిపల్ శానిటేషన్ కార్మికులకు సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం సమాన పనికి సమాన వేతనం అందించాలని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఆకుల వెంకటేష్ డిమాండ్ చేశారు. అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం జడ్చర్ల మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ కళాభవనంలో మున్సిపల్ శానిటేషన్ విభాగం మహిళా కార్మికులతో కేక్ కటింగ్ చేయించి ఘనంగా శాలువలతో సన్మానించారు.
జిల్లా అధ్యక్షుడు, పట్టణ కమిటీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు, ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఆకుల వెంకటేష్, మహేష్, కేశవులు, కృష్ణ మాట్లాడుతూ అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం జరుపుకోవడానికి మహిళలకు స్ఫూర్తి క్లారా జైట్కిన్ అని, ఆమె ఆశయాలు కొనసాగిస్తూ మహిళల యొక్క హక్కులకై పోరాడాలని అన్నారు. ప్రభుత్వము మున్సిపల్ మహిళా కార్మికుల గుర్తించకపోవడం అన్యాయమని, మహిళా కార్మికులు తమ కుటుంబాలను వదిలి పొద్దున 5గంటల నుండి శ్రమించి పట్టణాలను, రోడ్లు శుభ్రం చేస్తూ తమ జీవితాలను చాలీచాలని వేతనాలతో గడుపుతున్నారని వాపోయారు.
మహిళ కార్మికులు అంజమ్మ, భారతి, లక్ష్మమ్మ, ఇందిరమ్మ, స్వరూపలు మాట్లాడుతూ మహిళలపై వివక్ష గురిచేస్తూ ఎటువంటి హక్కులు లేకుండా చేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వము రాజ్యాంగం ప్రకారం 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లు గా మార్చి కార్మిక వర్గానికి అన్యాయం చేస్తుందని అన్నారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర ధరలను నియంత్రించి ప్రజలకు న్యాయం చేయాలని అన్నారు. కార్యక్రమంలో దేవమ్మ, అలివేలు,అరుణ, శివలీల, నర్సమ్మ, అనూష, చంద్రకళ, నాగమ్మ, బెల్లం జయమ్మ, మల్లేష్, బాల స్వామి పాల్గొన్నారు.