అనన్య న్యూస్, జడ్చర్ల: మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేట రోడ్డులో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు బుధవారం గోనయో ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎగ్జామ్ ప్యాడ్లను, పెన్నులను అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎంఈఓ మంజులాదేవి చేతుల మీదుగా అందజేశారు. గోనయో ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండల పరిధిలో మొత్తం వెయ్యి మంది విద్యార్థులకు అందజేశారు. కార్యక్రమంలో గోనయో ఫౌండర్ ప్రశాంత్, సభ్యులు బాలరాజ్, రవీందర్, హర్షవర్ధన్ రెడ్డి, నవీన్, ఆకాష్, పాఠశాల ఉపాధ్యాయులు, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు పిట్టల నరేష్ తదితరులు ఉన్నారు.
JCL: విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్నుల పంపిణీ..
RELATED ARTICLES