- ప్రమాద రహిత స్థలంలో ఏర్పాటు చేయాలని ప్రజల వినతి..
అనన్య న్యూస్, జడ్చర్ల: మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేట దగ్గర 44వ జాతీయ రహదారి ఐబి బంగ్లా ఎదురుగా రోడ్డు అండర్ బ్రిడ్జి సమీపంలో హైదరాబాద్ వెళ్లే రోడ్డులో ఉన్న రిక్వెస్ట్ బస్ స్టాప్ తో ప్రమాదం పొంచి ఉంది. వివరాల్లోకి వెళితే కావేరమ్మపేట దగ్గర జాతీయ రహదారిపై అండర్ బ్రిడ్జి వేసే క్రమంలో రోడ్డును తవ్వి మట్టిని తొలగించి రోడ్డు వేశారు. రోడ్డు వేసే క్రమంలో రహదారిపై ఆర్.అండ్.బి అతిథి గృహం సమీపంలోని శ్రీ బంగారు మైసమ్మ దేవాలయం ఎదురుగా ఉన్న రిక్వెస్ట్ బస్ స్టాప్ వెనకాల 10 ఫీట్ల లోతు మట్టిని తీసి సబ్ రోడ్డు వేశారు.
దాంతో బస్ స్టాప్ వెనకాల మట్టి లేక బస్ స్టాప్ పరిస్థితి ప్రమాదకరంగా మారింది. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం వచ్చిన సమయంలో రిక్వెస్ట్ బస్ స్టాప్ కూలే ప్రమాదం ఉంది. కావున బస్ స్టాప్ ను తొలగించి ఇప్పుడు ఉన్న బస్టాప్ నుంచి కొంత దూరం ముందుకు ప్రమాద రహిత స్థలంలో ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

దీనికి తోడు అండర్ బ్రిడ్జి వేసిన తర్వాత రిక్వెస్ట్ బస్ స్టాప్ నిరుపయోగంగా మారింది. బ్రిడ్జి పై నుండి హైదరాబాద్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు, భారీ వాహనాలు అతివేగంగా రావడంతో రిక్వెస్ట్ బస్ స్టాప్ దగ్గర ఆగే పరిస్థితి కూడా లేదు. అలాగే జాతీయ రహదారి మీదుగా వెళ్తున్న వాహనదారులు రిక్వెస్ట్ బస్టాప్ ఉందని అక్కడ పార్కింగ్ చేయడంతో వేగంగా వస్తున్న వాహనాలకు ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాంటి ప్రమాదకరమైన రిక్వెస్ట్ బస్టాప్ ను జాతీయ రహదారి అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి బస్ స్టాప్ ను తొలగించాలని కావేరమ్మపేట, జడ్చర్ల, పరిసర గ్రామాల ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు.
రిక్వెస్ట్ బస్ స్టాప్ నిరుపయోగమే: గుండు చంద్రశేఖర్, కావేరమ్మపేట..

కావేరమ్మ పేట 44వ జాతీయ రహదారిపై అండర్ బ్రిడ్జి దగ్గర హైదరాబాద్ రోడ్డులో ఉన్న మినీ బస్ స్టాప్ తో నిరుపయోగమే ఉంది. అందులోనూ అండర్ బ్రిడ్జి వేసే క్రమంలో బస్టాండ్ వెనకాల మట్టిని తొలగించి రోడ్డుని వేశారు. దాంతో బస్టాండు అడుగుభాగం పటిష్టంగా లేకపోవడం వర్షాకాలం ప్రమాదం తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ బస్సులు ఎక్కేందుకు ప్రయాణికులు ఆగాలన్న అండర్ బ్రిడ్జి మీది నుండి వేగంగా వస్తున్న వాహనాలతో ప్రయాణికులకు ప్రమాదాలు తలతే అవకాశం ఉంది. అందుకు ఈ బస్టాండ్ ను ఇప్పుడున్న స్థానం నుంచి కొద్ది దూరంలో ఉన్న కాలనీ ఎదురుగా ఏర్పాటు చేస్తే కాస్త ఉపయోగకరంగా ఉంటుంది.