అనన్య న్యూస్, జడ్చర్ల: గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. జడ్చర్ల మండలం బూరుగుపల్లి గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను బుధవారం ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు ఉపాధ్యాయులు బోధించే విద్యను సక్రమంగా అభ్యసించాలని, ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారి ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేయాలని అన్నారు. గత ఐదు సంవత్సరాలుగా నియోజకవర్గంలో గ్రామాల అభివృద్ధికి కృషి చేసిన వివిధ గ్రామాల సర్పంచులను, వార్డు మెంబర్లను ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, మండల విద్యాశాఖ అధికారిని మంజులాదేవి, తదితరులు నాయకులు ఉన్నారు.
JCL: నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యం: ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి..
RELATED ARTICLES