అనన్య న్యూస్, జడ్చర్ల: ఈనెల 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో శాజాపూర్ లో పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో జరిగే 67వ హ్యాండ్ బాల్ అండర్ 17 జాతీయ స్కూల్ గేమ్స్ కు జడ్చర్ల మండలం కోడ్గల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు మారేపల్లి శ్రీనివాసులు గురువారం ఒక పత్రిక ప్రకటనలో తెలిపారు. బాలికల విభాగంలో జే. నందిని, బాలుర విభాగంలో ఎం. సక్కురామ్ లు కోడ్గల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న వీరు ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి పోటీలలో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. జాతీయ స్థాయికి ఎంపికైన విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, వ్యాయామ ఉపాధ్యాయులు శంకర్ నాయక్, అశోక్, ఉపాధ్యాయులు షరీఫ్, గోబ్రియ, వెంకటేశ్వర్లు లతో పాటు ఇతర ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేసి జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు.
JCL: జాతీయస్థాయి పోటీలకు కొడ్గల్ విద్యార్థులు ఎంపిక: ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు..
RELATED ARTICLES