అనన్య న్యూస్, జడ్చర్ల: మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేట శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో బుధవారం విద్యార్థులు స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించి పలువురిని ఆకట్టుకున్నారు. జిల్లా కలెక్టర్ గా భాను తేజ, డీఈఓ గా కార్తీక్, ఎంఈఓ గా ప్రవళిక, ప్రధానోపాధ్యాయులుగా మహేయ బేగం లతోపాటు తదితర విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. మహేష్, మాతాజీలు తదితరులు పాల్గొన్నారు.