- నియోజకవర్గాన్ని అవినీతి రహితంగా మారుస్తా: ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి..
అనన్య న్యూస్, జడ్చర్ల: కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలని, కార్యకర్తల కృషి పట్టుదలే కాంగ్రెస్ పార్టీ విజయానికి కారణమని సిడబ్ల్యుసి ప్రత్యేక ఆహ్వానితుడు చల్ల వంశీధర్ రెడ్డి అన్నారు. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని చంద్ర గార్డెన్ ఫంక్షన్ హాల్ లో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అధ్యక్షతన శనివారం నిర్వహించిన నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా సిడబ్ల్యుసి ప్రత్యేక ఆహ్వానితులు చల్ల వంశీధర్ రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముదిరాజ్, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనా రెడ్డి లు హాజరయ్యారు. ఈ సమావేశంలో వంశీ చందర్ రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలు నాయకుల సమిష్టి కృషి ఫలితంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతుందని, పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి, బిఆర్ఎస్ పార్టీలో ఒకటయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు.
రాష్ట్రంలోనే మహబూబ్ నగర్ పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అత్యధిక పార్లమెంట్ స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుందన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నేను స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కలిసి పీఎం రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో జడ్చర్ల పట్టణాన్ని మరింత అభివృద్ధి పరుస్తామని అన్నారు. ఎలాగైతే ఎమ్మెల్యేలను గెలిపించిండ్రో రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించాలన్నారు.

నియోజకవర్గాన్ని అవినీతి రహితంగా మారుస్తా: ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి..
జడ్చర్ల నియోజకవర్గం వర్గాన్ని అవినీతి రహితంగా మారుస్తానని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో ఏ కార్యకలాపాల్లో కూడా అవినీతి జరగకుండా శ్రద్ధ తీసుకొని ప్రజలకు నాణ్యమైన ప్రజా పరిపాలన అందించే కృషి చేస్తానని తెలిపారు. నా గెలుపు కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన నా కార్యకర్తలను అందరినీ గుండెల్లో పెట్టుకొని తీసుకుంటానని భరోసా ఇచ్చారు. గత పది సంవత్సరాల బిఆర్ఎస్ ప్రభుత్వంలో గత ఎమ్మెల్యే జడ్చర్ల నియోజకవర్గంలో భూదందాలు, భూకబ్జాలు, నల్లమట్టి అవినీతి దందాలను ప్రోత్సహించారని తొందర్లోనే చేసిన అవినీతి అక్రమాలు అన్నిటినీ బయటపెట్టి అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు చేపడతామని అన్నారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో జడ్చర్ల నియోజకవర్గం నుంచి 50 వేల మెజార్టీ లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని, గత ఎమ్మెల్యే ఎలక్షన్ లో మహబూబ్ నగర్ జిల్లాలోని 7 అసెంబ్లీ స్థానాలను ఏ విధంగా కష్టపడి గెలిపించారో అదేవిధంగా కష్టపడి పనిచేసి రాబోయే ఎంపీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అంతకుముందు జడ్చర్ల ఫ్లైఓవర్ నుంచి చంద్ర గార్డెన్ వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎన్ ఎస్ యు ఐ నాయకులు తదితరులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.