అనన్య న్యూస్, హైదరాబాద్: టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు మన్నే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంగళవారం ఢిల్లీలో కేసీ వేణుగోపాల్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. త్వరలో మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించే సభలో జీవన్ రెడ్డి అనుచరులు, అభిమానులు పార్టీలో చేరుతారని సమాచారం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలు తదితరులు ఉన్నారు.