అనన్య న్యూస్, జడ్చర్ల: సార్వత్రిక విద్య (ఓపెన్ స్కూల్ సొసైటీ) ద్వార ఈ విద్యా సంవత్సరం నిర్వహిస్తున్నటువంటి ప్రవేశాలపై అవగాహన కల్పించేలా రూపొందించిన వాల్ పోస్టర్ ను గురువారం బాదేపల్లి బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విడుదల చేశారు. ఓపెన్ స్కూల్లో పదవ తరగతి, ఇంటర్మీడియట్ ప్రవేశాలకు చివరి తేదీ అక్టోబర్ 30 వరకు అని తెలిపారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ శివయ్య, బాదేపల్లి బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రకళ, బాదేపల్లి కోఆర్డినేటర్ బాబర్, సీనియర్ ఉపాధ్యాయులు సయ్యద్ ఇబ్రహీం, గోపాల్, సునీల్ కుమార్, యుగంధర్, స్థానిక కౌన్సిలర్ రఘు పాల్గొన్నారు.
JCL: సార్వత్రిక విద్య ప్రవేశాల గోడపత్రిక విడుదల..
RELATED ARTICLES