అనన్య న్యూస్, జడ్చర్ల: జడ్చర్ల మున్సిపాలిటీ కావేరమ్మపేటలో శ్రీ భక్త మార్కండేయ జయంతిని వైభవంగా నిర్వహించారు. సోమవారం శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి సంఘం కావేరమ్మపేట, జడ్చర్ల ఆధ్వర్యంలో శ్రీ మద్దులమ్మ దేవి ఆలయ ప్రాంగణంలో జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు పున్న కాశీ విశ్వనాథ్ పాల్గొని శ్రీ భక్త మార్కండేయ స్వామికి పూలమాలలను అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ మృకండు మహర్షి యొక్క సంతానమైన శ్రీ భక్త మార్కండేయుడు బాలునిగానే ఉన్నప్పుడు యమున్ని జయించి శివుని ఆశీస్సులతో చిరంజీవత్వాన్ని పొందిన సద్గుణుడని, అంతటి మహనీయుని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు దైవభక్తి కలిగి ఉండాలని అన్నారు. కార్యక్రమంలో రుమాండ్ల పర్వతాలు, ఒగ్గు శ్రీధర్, నక్క చంద్రశేఖర్, చిక్క అశోక్ కుమార్, ఎల్ల హరిప్రసాద్, మల్లేష్, రుమాండ్ల సురేష్, చిక్క శ్రీనివాసులు, చిక్క రంగనాయకులు, గుత్తి అనంతయ్య పాల్గొన్నారు