- రక్తదాన శిబిరం విజయవంతం చేద్దాం..
అనన్య న్యూస్, జడ్చర్ల: బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని నేడు సోమవారం నిర్వహిస్తున్న మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేద్దామని 2వ కౌన్సిలర్ బుక్క మహేష్ పిలుపునిచ్చారు. ఆదివారం 2వ కౌన్సిలర్ బుక్క మహేష్ పత్రికా ప్రకటన ద్వారా తెలుపుతూ మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించే మెగా రక్తదాన శిబిరం నేడు పట్టణంలోని ప్రేమ్ రంగా గార్డెన్ లో ఏర్పాటు చేస్తున్న సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు, యువకులు అధిక సంఖ్యలో హాజరై రక్తదానం చేసి ప్రాణదాతలు అవ్వాలని కోరారు.