అనన్య న్యూస్, జడ్చర్ల: మున్సిపల్ కమిషనర్, చైర్ పర్సన్ భర్త అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్ కు కౌన్సిలర్లు వినతి పత్రం అందజేశారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో జడ్చర్ల పాలకవర్గం తరుపున కౌన్సిలర్లు చైతన్య చౌహన్, శశికిరణ్ లు కలెక్టర్ కు ఫిర్యాదు సమర్పించారు. కలెక్టర్ కు అందించిన ఫిర్యాదుపై మద్దతుగా కౌన్సిలర్లు శ్రావణి, చైతన్య గౌడ్, శ్రీశైలమ్మ, పుష్పలత తదితరులు సంతకాలు చేసినట్టు కౌన్సిలర్లు చైతన్య చౌహన్, శశికిరణ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జడ్చర్ల మున్సిపల్ కమిషనర్ షేక్ మహమూద్ జడ్చర్లలో విధులు నిర్వహిస్తున్న అప్పటి నుంచి మున్సిపల్ చైర్ పర్సన్ భర్త రవీందర్ తో కలిసి మున్సిపాలిటీలో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని వారి అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కోరారు. దీని ప్రతులను తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయానికి, తెలంగాణ సిడిఎంఏ కార్యాలయానికి, ద అడిషనల్ డీజీ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ తెలంగాణ కార్యాలయాలకు పంపినట్లు తెలిపారు.
JCL: మున్సిపల్ కమిషనర్ పై కలెక్టర్ కు ఫిర్యాదు..
RELATED ARTICLES