అనన్య న్యూస్, జడ్చర్ల: బీసీ సమాజ్ జడ్చర్ల కన్వీనర్ గా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేటకు చెందిన గుండు శివలీల ఎన్నికయ్యారు. సోమవారం హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో తీన్మార్ మల్లన్న చేతుల మీదుగా బీసీ సమాజ్ జడ్చర్ల కన్వీనర్ గా గుండు శివలీల నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా శివలీల మాట్లాడుతూ నాపై నమ్మకంతో బీసీ సమాజ్ జడ్చర్ల కన్వీనర్ గా నియమించినందుకు తీన్మార్ మల్లన్నకు ధన్యవాదాలు తెలుపుతున్నానని, ఈడబ్ల్యూఎస్, జీవో 29 ద్వారా బీసీ సమాజానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తి, బీసీలను చైతన్య పరుస్తానని అన్నారు. కార్యక్రమంలో బీసీ సమాజ్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు, ఉద్యోగ సంఘం నాయకులు వెంకటేశ్వర్లు, శ్రీధర్, మహేశ్వరి తదితరులు ఉన్నారు.