అనన్య న్యూస్, జడ్చర్ల: నీటి కుంటలో పడి తల్లి, కూతురు మృతి చెందిన ఘటన జడ్చర్ల మండలం గొల్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. జడ్చర్ల సిఐ రమేష్ బాబు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటక రాష్ట్రం రాయచూరు గ్రామానికి చెందిన సుజాత, భర్త తో కలిసి గొల్లపల్లి గ్రామంలో వ్యవసాయ చేసేవారని, వ్యవసాయ పొలంలో పనుల నిమిత్తం ఏర్పాటు చేసిన నీటి గుంత వద్ద బుధవారం బట్టలు ఉతకడానికి సుజాత (25) కూతురు నరసమ్మ (2)తో వెళ్లి బట్టలు ఉతుకుతుండగా నరసమ్మ ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడడంతో ఆమెను రక్షించే క్రమంలో సుజాత కూడ నీటి గుంతలో పడి ప్రాణాలు కోల్పోయింది. సుజాత భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాలను బాదేపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.