అనన్య న్యూస్, జడ్చర్ల: భారతదేశ భవిష్యత్తు కోసం మరోసారి నరేంద్ర మోదీ ప్రధాని కావాల్సిందేనని బిజెపి పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో సోమవారం నిర్వహించిన బిజెపి ముఖ్య కార్యకర్తల సమావేశంలో బిజెపి పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ పాల్గొని మాట్లాడారు. పాలమూరు ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి జరగాలంటే మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థిగా డీకే అరుణ గెలవాలని అన్నారు. పాలమూరు క్రెడిట్ అంతా అరుణమ్మ దేనని, పాలమూరుపై కాంగ్రెస్ రాజకీయం చేస్తుందని, పాలమూరు, రంగారెడ్డికి బీజం వేసింది నేనేనని అన్నారు.
ఆనాడు సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో కొట్లాడి సర్వే జీవో తెస్తే, ప్రాజెక్టు గురించి ఆనాడు మాట్లాడనోళ్లు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. పాలమూరు చరిత్ర కాంగ్రెస్ నేతలకు తెలియదన్నారు. మేము కాంగ్రెస్ లా అబద్ధపు హామీలు ఇవ్వమని, మాట ఇస్తే మాట తప్పమన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేస్తామని చేశామన్నారు. ప్రజలు బిజెపికి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని, దేశంలో బిజెపి తప్ప ఏ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్నారు.
ఈరోజు ప్రపంచమే మోదీ పాలనను చూసి మోడీ మేనియా మొదలైందని ఎటు వెళ్లిన మోదీ ప్రభంజనం కొనసాగుతుందని, ప్రపంచ దేశాలకు కరోనా టీకాలు ఇచ్చి ఆదర్శంగా నిలిచిన మహా నాయకుడు మోదీ అన్నారు. జాతి గర్వపడేలా ఆర్థిక ప్రగతని పెంచిన ఘనత మోది దేనని, ప్రపంచ దేశాలను తలదన్నేలా మోడీ పాలనలో భారత్ రూపుదిద్దు కుంటుందని తెలిపారు. 5 వందల ఏళ్లనాటి హిందువుల కల అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేపట్టి ప్రతి ఇంటికి అక్షింతలు పంపిన మోదిని మనం తప్పక ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.