అనన్య న్యూస్, జడ్చర్ల: జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని నిమ్మబావి గడ్డ వద్ద ఎర్రగుట్ట దగ్గర నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కొరకు లబ్ధిదారుల ఎంపిక కోసం అప్లికేషన్ చేస్తున్న సమయంలో రేషన్ కార్డుతో ముడి పెట్టకుండా అప్లికేషన్లను తీసుకోవాలని ఏఐఎంఐఎం జడ్చర్ల నియోజకవర్గ అధ్యక్షులు ఎండి జాకీర్ అలీ కోరారు. శనివారం ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో తాహాసిల్దార్ సత్యనారాయణ రెడ్డికి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా జాకీర్ అలీ మాట్లాడుతూ అర్హులైన పేదవారికి గత పది సంవత్సరాలుగా రేషన్ కార్డులు అందక అవస్థలు పడుతున్నారని, ఇప్పుడు నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజా పాలనలో రేషన్ కార్డుల కొరకు అప్లై చేసుకున్నారని, అలాంటిది ఇప్పుడు అర్హులైన పేదలు డబల్ బెడ్ రూమ్ లకు అప్లై చేసుకుంటున్న సమయంలో రేషన్ కార్డుతో సంబంధం లేకుండా అప్లికేషన్లు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో నాయకులు ఎంఏ జాహేద్, కే యం యాసర్, సోహెల్, అజ్హర్, అన్వర్, షకీల్, పర్వేజ్ తదితరులు ఉన్నారు.