అనన్య న్యూస్, జడ్చర్ల: జడ్చర్ల మండలం బురెడ్డిపల్లి శివారు 44వ జాతీయ రహదారి పై సోమవారం గంజాయి లభ్యమైంది. గుర్తుతెలియని వ్యక్తి సంచిలో గంజాయి పెట్టి రోడ్డుపై వదిలి వెళ్లారని, స్థానికులు సంచిని గుర్తించి జడ్చర్ల సిఐ రమేష్ బాబుకు సమాచారం అందించగా పోలీసులు అక్కడికి వెళ్లి సంచిని పరిశీలించగా అందులో 800 గ్రాముల గంజాయి లభ్యమయింది. గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయితో పాటు ఒక చిన్న త్రాసు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ఎవరో జడ్చర్లలో గంజాయి వ్యాపారం చేయడానికి వచ్చినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విషయాన్ని జిల్లా పోలీస్ అధికారుల దృష్టికి తీసుకెళ్తామని, నిందితులను గుర్తించేందుకు విచారణ చేపట్టారు.