అనన్య న్యూస్, జడ్చర్ల: మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేట గణేష్ యూత్ సేన సభ్యులు, శ్రీ బంగారు మైసమ్మ దేవాలయం అభివృద్ధి కమిటీ కార్యనిర్వాహక సభ్యుడు గోనెల సత్యనారాయణ (సత్యం) జ్ఞాపకార్థం ఈనెల 13 బుధవారం ఉదయం కావేరమ్మపేట ఆటో చౌరస్తాలో గ్రంథాలయం ఎదురుగా రక్తదానం శిబిరం నిర్వహిస్తున్నట్లు గోనెల సత్యం మిత్ర బృందం తెలిపారు.
సోమవారం వారు మీడియాతో మాట్లాడుతూ ఇటీవల గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ మార్చి 4వ తేదీన మృతి చెందిన గోనెల సత్యం జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న రక్తదాన శిబిరంలో సత్యం మిత్ర బృందం, బంధుమిత్రులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయాలని, మానవతా దృక్పథంతో చేసే రక్తదానం అత్యవసర పరిస్థితుల్లో మరొకరికి ప్రాణదానాన్ని ఇచ్చే మహోన్నత కార్యక్రమంలో అధిక సంఖ్యలో యువతీ, యువకులు పాల్గొని రక్తదానం చేయాలని కోరారు.