అనన్య న్యూస్, జడ్చర్ల: పార్టీ కార్యకర్తలే పార్టీకి బలమని మాజీ మంత్రి, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు సి. లక్ష్మారెడ్డి అన్నారు. ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన బిఆర్ఎస్ కార్యకర్త గుండు హరికృష్ణ పార్టీ సభ్యత్వం కలిగి ఉండడంతో పార్టీ సభ్యత్వం వల్ల కలిగిన ఇన్సూరెన్స్ సదుపాయం ద్వారా అతని కుటుంబానికి రూ.2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చెక్కును గురువారం మాజీ మంత్రి లక్ష్మారెడ్డి హరికృష్ణ తండ్రికి గుండు చెన్నయ్య కి అందజేశారు.
ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలే పార్టీకి బలం అని, వారికి ఏ ఆపద కలిగిన వారి వెంట తాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, ఇప్పటికే పార్టీ ఇన్సూరెన్స్ ద్వారా ఎంతో మంది కార్యకర్తలకు సహాయం అందజేశామని తెలిపారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.