అనన్య న్యూస్, జడ్చర్ల: మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గత ప్రభుత్వ హయాంలో బాలనగర్ నుండి గంగాపూర్ వరకు డబుల్ లైన్ రోడ్డు ను మంజూరు చేయించగా దాన్ని ప్రస్తుత ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మంజూరు చేయించానని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, పిఎసిఎస్ చైర్మన్ పాలెం సుదర్శన్ గౌడ్ ఆరోపించారు. సోమవారం మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పై ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పదేపదే అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని, బాలనగర్ నుంచి గంగాపూర్ వరకు డబుల్ రోడ్డు విస్తరణకు మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి హయాంలోనే నిధులు మంజూరు అయ్యాయని, సంబదిత జీవో తప్పని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నిరూపిస్తే స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ముక్కు నేలకు రాస్తామని అన్నారు.
ఇటీవల డిప్యూటీ సీఎం జడ్చర్లలో పర్యటించిన సందర్భంగా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఈ రోడ్డును తాను మంజూరు చేయించినట్లు చెప్పారని, 2023 జులై నెలలో రూ. 56 కోట్ల రూపాయలను అప్పటి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మంజూరు చేయించారని, టెండర్ కూడా పూర్తయిందని అన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు రఘుపతి రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు, రామ్మోహన్, నర్సింలు, శంకర్ నాయక్, ఇంతియాజ్ ఖాన్, వీరేష్ తదితరులు ఉన్నారు.