అనన్య న్యూస్, జడ్చర్ల: జడ్చర్ల మున్సిపల్ చైర్ పర్సన్ గా ఎన్నికైన కోనేటి పుష్పలత మాజీ మంత్రి, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ సి. లక్ష్మారెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. జడ్చర్ల మున్సిపల్ చైర్ పర్సన్ గా సోమవారం ఎన్నికైన కోనేటి పుష్పలత మంగళవారం టిఆర్ఎస్ కౌన్సిలర్లతో కలిసి మాజీ మంత్రి లక్ష్మారెడ్డిని హైదరాబాద్ లో ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కోనేటి పుష్పలత లక్ష్మారెడ్డికి పూల బొకేని అందజేసి, శాలువాతో ఘనంగా సన్మానించి మిఠాయిలను అందజేశారు. అనంతరం లక్ష్మారెడ్డి పుష్పలతను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రిని కలిసిన వారిలో కౌన్సిలర్లు బుక్క మహేష్, కోట్ల ప్రశాంత్ రెడ్డి, నందకిషోర్ గౌడ్, జ్యోతి రెడ్డి, శశికిరణ్, ఉమా శంకర్ గౌడ్, దేవా, ఉమాదేవి, రఘురాం గౌడ్, నాయకులు కోనేటి నరసింహులు, పిట్టల మురళి, రామ్మోహన్, బికేఆర్, కొండల్, వెంకటేష్ తదితరులు ఉన్నారు.
JCL:మాజీ మంత్రిని కలిసిన మున్సిపల్ చైర్ పర్సన్..
RELATED ARTICLES