అనన్య న్యూస్, జడ్చర్ల: జాతిపిత మహాత్మా గాంధీ చూపిన మార్గంలో పయనిద్దామని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా జడ్చర్ల నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జడ్చర్ల పట్టణములోని పలు కూడలల్లో గాంధీ విగ్రహాలకు ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
జడ్చర్ల పాతబజార్ గాంధీ చౌక్ వద్ద ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మహనీయులు మహాత్మా గాంధీ అహింస మార్గంతోనే దేశానికి స్వాతంత్ర్యం సాధించారని అదే స్ఫూర్తితో సీఎం కేసిర్ కూడా అహింస మార్గంలో తెలంగాణను సాధించారని, తొమ్మిది ఏండ్ల నుండి రాష్ట్రంలో శాంతియుత వాతావరణం నెలకొల్పబడిందని, సమాజంలో ఇలాంటి వాతావరణం ఏర్పడటం వలనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. మహాత్మా గాంధీకి ఇదే అసలైన ఘననివాళి అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
అంతకు ముందు జడ్చర్ల మాజీ శాసనసభ్యులు స్వర్గీయ కీశే కొత్త కేశవులు జయంతి సందర్భముగా మండల పరిషత్ కార్యాలయం ఆవరణలోని కేశవులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమాలలో జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ దోరేపల్లి లక్ష్మి, పిఎసిఎస్ చైర్మన్ పాలెం సుదర్శన్ గౌడ్, మార్కెట్ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, కౌన్సిలర్లు, ముడా డైరెక్టర్లు, నాయకులు తదితరులు ఉన్నారు.