అనన్య న్యూస్, జడ్చర్ల: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మన ఊరు మనబడి పథకంతో సర్కారు పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం రాజాపూర్ మండలం కల్లేపల్లిలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో మన ఊరు- మన బడి పథకంలో రూ.17,65,254 తో చేపట్టిన తరగతి గదుల మరమ్మతు, తాగునీటి సౌకర్యం, బాలికలకు టాయిలెట్స్, పాఠశాలలో విద్యుదీకరణ పనులను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1001 గురుకులాలను స్థాపించి, కార్పొరేట్ స్థాయి వసతులతో, నాణ్యమైన పౌష్టికాహారంతో, కేజీటు పీజీ ఉచిత విద్య అందించే దిశగా సర్కార్ అడుగులు వేస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం బోధన ప్రారంభించడంతో విద్యార్థుల నమోదు సంఖ్య పెరుగుతుందన్నారు. గురుకులాల్లో చదివిన విద్యార్థులు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల్లో ఉన్నత స్థాయిలో ఎదుగుతున్నారని చెప్పారు.
విద్యుదాఘాతంతో మరణించిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుండి రూ.5.00 లక్షల ఎక్స్ గ్రేషియా చెక్కుల పంపిణీ:
విద్యుదాఘాతంతో మరణించిన చెన్నవేల్లి గ్రామానికి చెందిన యాదన్న, హనుమన్ గండ్ల తండాకు చెందిన డేగవత్ గోపాల్ కుటుంబాలను ప్రభుత్వం నుండి మంజూరు చేయించిన ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా చెక్కులను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి బాధిత కుటుంబాలకు అందజేశారు.