అనన్య న్యూస్, జడ్చర్ల: శ్రీ బంగారు మైసమ్మ దేవత బోనాల ఉత్సవ కమిటీ అధ్యక్షులుగా ఈర్లపల్లి శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేటలో డాగ్ బంగ్లా పక్కన, జాతీయ రహదారిపై ఉన్న శ్రీ బంగారు మైసమ్మ దేవత బోనాల ఉత్సవ కమిటీని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
బోనాల ఉత్సవ కమిటీ అధ్యక్షులుగా ఈర్లపల్లి శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా జి. విజయ్ కుమార్, కోశాధికారులుగా ఒగ్గు శ్రీధర్, గోనెల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శులుగా బుక్క శివ, మిద్దె నాగరాజు, సహాయ కార్యదర్శులుగా గుండు శ్రీశైలం, బుక్క రమేష్, దండు శివ, దండు కృష్ణ, కార్యదర్శులుగా చిక్క శేఖర్, వడ్లని నాగరాజు, ఆలూరు వెంకటేష్, ఉల్లి యాదగిరి, ముఖ్య సలహాదారులుగా పొట్టి యాదయ్య, చింతకుంట వెంకటేష్, గుండు చంద్రశేఖర్, పండ్ల దేవరాజ్, రొట్టె జంగయ్య, పోల శ్రీనివాసులు లను దేవాలయ అభివృద్ధి కమిటీ సమక్షంలో ఎన్నుకున్నారు.
శ్రీ బంగారు మైసమ్మ అమ్మవారి బోనాలను ఆగస్టు 27 ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించే బోనాల పండుగ మహోత్సవంలో భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.