- మలుపు వద్ద రోడ్డు ఎత్తుగా ఉండడంతో పొంచి ఉన్న ప్రమాదం..
అనన్య న్యూస్, జడ్చర్ల: కావేరమ్మ పేట నుంచి అటు బాదేపల్లి, మరియు జాతీయ రహదారి కొత్త బస్టాండ్ వెళ్లే రోడ్డు జడ్చర్ల పట్టణ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం సమీపంలో గాంధీ బొమ్మ దగ్గర ఉన్న రోడ్డు మలుపు వద్ద రోడ్డు ఎత్తుగా ప్రమాదకరంగా ఉండడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
జాతీయ రహదారి ఫ్లైఓవర్ నుండి గ్యాస్ ఆఫీస్ వరకు వేసిన రోడ్డులో భాగంగా కావేరమ్మపేటకు వెళ్లే మార్గంలో డ్రైనేజీకి నిర్మించిన కల్వర్టు ఒక్కసారిగా ఎత్తుగా వేయడంతో అటు కావేరమ్మపేట నుంచి వచ్చిన వాహనాలు, బాదేపల్లి, కొత్త బస్టాండ్ నుండి వచ్చిన వాహనాలు మలుపు వద్ద కల్వర్టు ఎత్తుగా కంకర తేలి ప్రమాదకరంగా ఉండడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కల్వర్టు ఎత్తుగా ఉండడంతో వాహనాలు కల్వర్టుపై నిలిపి ఎటు మళ్లీ వెళ్లాలన్న వాహనదారులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

దీనికి తోడు ఫ్లై ఓవర్ నుండి బాదేపల్లి పట్టణంలోకి వెళ్లే వాహనాలు వేగంగా వస్తుండడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రమాదాలకు కారమైన కావేరమ్మ పేట మలుపు వద్ద రోడ్డు మరమ్మత్తులు చేపట్టాలని, వెంటనే సంబంధిత అధికారులు స్పందించి ప్రమాదాలు జరగకుండా కల్వర్టు దగ్గర మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.