అనన్య న్యూస్, జడ్చర్ల: మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ చౌరస్తాలో జడ్చర్ల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల ఆధ్వర్యంలో సోమవారం ప్రజా యుద్ధ నౌక, ప్రజా గాయకుడు గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ ప్రజా గాయకుడు అణగారిన వర్గాల విప్లవ గొంతుక, గద్దర్ మరణం తెలంగాణ రాష్ట్రానికి తీరనిలోటని, తెలంగాణ మలిదశ ఉద్యమంలో గద్దర్ గొంతుక ఒక విప్లవ శంఖాన్ని పూరించి, రాష్ట్ర సాధన కోసం ఏకం చేసిన గొప్ప గాయకుడని అన్నారు. కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు.
Jadcherla: ప్రజా గాయకుడు గద్దర్ కు ఘన నివాళులు..
RELATED ARTICLES