ఆనందం వ్యక్తం చేసిన బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు..
అనన్య న్యూస్, జడ్చర్ల: జడ్చర్ల బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మళ్లీ చర్లకోల లక్ష్మారెడ్డికి దక్కింది. నాలుగవసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో జడ్చర్ల బిఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఎన్నికల బరిలో నిలవబోతున్నారు. సోమవారం బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సీఎం కేసీఆర్ ప్రకటించడంతో ఆప్రకటనలో జడ్చర్ల బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే చర్లకోల లక్ష్మారెడ్డి పేరును ప్రకటించడంతో జడ్చర్ల బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జడ్చర్ల అంబేద్కర్, పూలే, నేతాజీ చౌరస్తాలో బాణాసంచా కాల్చి ఆనందోత్సవాలతో సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అపార రాజకీయ అనుభవంతో ప్రజా సేవకుడిగా, నిరంతర శ్రామికుడిగా, రైతు బాంధవుడిగా ప్రజలలో మమేకమై ఉంటూ జడ్చర్ల నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారని అన్నారు. నిరంతరం నియోజకవర్గ అభివృద్ధికై శ్రమిస్తూ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేశారని అన్నారు. గతంలో కంటే అత్యధిక మెజారిటీతో జడ్చర్ల ఎమ్మెల్యే గా లక్ష్మారెడ్డిని గెలిపించుకుంటామని పెద్ద ఎత్తున నినదించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, జడ్చర్ల మున్సిపల్ చైర్ పర్సన్ దోరేపల్లి లక్ష్మి, కౌన్సిలర్లు, ముడా డైరెక్టర్లు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.