అనన్య న్యూస్, జడ్చర్ల: వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని టిపిసిసి ప్రధాన కార్యదర్శి జనంపల్లి అనిరుద్ రెడ్డి అన్నారు. శనివారం జడ్చర్ల మండలంలోని ఈర్లపల్లి తండాలో వివిధ పార్టీలకు చెందిన 105 మంది యువకులు అనిరుద్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కండువా వేసి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం తండాలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ గత పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చేసింది ఏమీ లేదని, ప్రభుత్వ పాలనపై ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామన్న ప్రభుత్వం ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేశారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇల్లు లేని నిరుపేదలకు 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తుందని తెలిపారు. రైతులకు, కౌలు రైతులకు సంవత్సరానికి ఎకరానికి 15 వేల రూపాయల పెట్టుబడి సాయం అందించి, ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ను రద్దు చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Jadcherla: కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం: టిపిసిసి ప్రధాన కార్యదర్శి అనిరుద్ రెడ్డి..
RELATED ARTICLES