- అనంతరం ఢీకొన్న మూడు వాహనాలు, 5గురికి తీవ్ర గాయాలు, 4 గంటల పాటు భారీగా ట్రాఫిక్ జామ్..
అనన్య న్యూస్, జడ్చర్ల: 44వ జాతీయ రహదారిపై పొట్టు లారీ బోల్తా పడింది. దీంతో పాటు మరో మూడు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో పాటు, నాలుగు గంటలకు పైగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ప్రయాణికులు నరకయాతన అనుభవించారు. వివరాల్లోకి వెళ్తే జడ్చర్ల మండల పరిధిలోని మాచారం వద్ద హైదరాబాద్ రూట్ లో ఈ ఘటన జరింది. మంగళవారం ఉదయం 5:30 ప్రాంతంలో 44వ జాతీయ రహదారిపై డివైడర్ ను పొట్టు లారీ ఢీ కొట్టి బోల్తాపడింది. దీంతో ఒక్కసారిగా జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు కర్నూల్ రూట్ లో వన్ వే పై వెళ్తున్నారు.
ఈ క్రమంలో గొల్లపల్లి వద్ద కర్నూల్ వైపు నుంచి వెళ్తున్న పాల ట్యాంకర్ జడ్చర్ల వైపు వెళ్తున్న భారత్ బెంజ్ లారీ ఒకదానికొకటి ఎదురుగా ఢీకొన్నాయి. వీరి వెనకాల హైదరాబాద్ నుంచి జడ్చర్ల వైపు వస్తున్న కారు భారత్ బెంజ్ లారీని వెనుక నుంచి ఢీకొంది. దీంతో కారులో ఉన్న వారితో పాటు లారీ డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యా యి. గాయపడిన 5గురిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇందులో భారత్ బెంజ్ లారీ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. వాహనాలు రోడ్డుకు అడ్డంగా పడడంతో అటు హైదరాబాద్ – కర్నూల్ రూట్లో సుమారు 10కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో సుమారు నాలుగు గంటల నుంచి ప్రయా ణికులు జాతీయ రహదారిపై ట్రాఫిక్ లో ఇరుక్కున్నారు.
జాతీయ రహదారిపై తాగడానికి మంచినీళ్లు, చిన్నారులకు పాలు నీళ్లు లేక, కాలకృత్యాలు తీర్చుకోవడానికి వీలులేక సుమారు నాలుగు గంటల పాటు నరకయాతన అనుభవించారు. నాలుగు గంటల పాటు శ్రమించిన పోలీసులు రోడ్డుపై అడ్డంగా పడిన వాహనాలను తొలగించి, రాకపోకలు ప్రారంభించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు జడ్చర్ల పోలీసులు తెలిపారు.