- పూర్తి పారదర్శకంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ.
- పట్టణంలో అర్హులందరికీ డబల్ బెడ్ ఇండ్లు అందజేస్తాం.
- ఇండ్ల పట్టాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి..
అనన్య న్యూస్, జడ్చర్ల: డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిందని అలాగే అత్యంత పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. బుధవారం జడ్చర్లలోని చంద్ర గార్డెన్ ఫంక్షన్ హాల్ లో కావేరమ్మపేట, జడ్చర్లకు చెందిన 120 మంది లబ్ధిదారులకు డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి ప్రభుత్వ అధికారుల స్క్రూటిని అనంతరం ఎంపిక చేసినట్లు తెలిపారు. విడతల వారీగా ప్రతి ఒక్క అర్హుడికి డబల్ బెడ్ రూమ్ ఇల్లును అందజేయడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
గత తొమ్మిది ఏళ్లలో అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందిందన్నారు. ఎన్నికల సమయంలో అన్ని పార్టీల వల్ల వచ్చి ఉచిత హామీలు ఇచ్చి మోసం చేసే ప్రయత్నం చేస్తారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సంక్షేమం అభివృద్ధిలో నేడు తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇన్ని పథకాలు, ఇంత అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ దొరేపల్లి లక్ష్మి, వైస్ చైర్ పర్సన్ సారిక, తహసిల్దార్ శ్రీనివాసులు, కౌన్సిలర్లు మహేష్, జ్యోతి రెడ్డి, రాజు, శశికిరణ్, నాయకులు ఎంఏ మాలిక్ షాకీర్, దోరేపల్లి రవీందర్, రామ్మోహన్, బి. కృష్ణారెడ్డి, ఇర్ఫాన్, షేక్ బాబా తదితరులు ఉన్నారు.