- నిత్యావసర సరుకుల పంపిణీ..
అనన్య న్యూస్: జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ నాయకులు వై.జి ప్రీతం సోమవారం మహబూబ్ నగర్ అప్పన్నపల్లిలో ఉన్న టచ్ అనాధ ఆశ్రమంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ప్రీతం మాట్లాడుతూ మంగళవారం జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని అనాధ ఆశ్రమంలో నిత్యవసర సరుకుల పంపిణీ చేయడం జరిగిందన్నారు.
ఈ సందర్భంగా చిన్నారులు హ్యాపీ బర్త్ డే ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సార్ అని శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో జడ్చర్ల మాజీ ఉపసర్పంచ్ శ్రీనివాసులు, నాయకులు భాస్కర్ రెడ్డి, కాశీ విశ్వనాథ్, కృష్ణారెడ్డి, ఆశ్రమ నిర్వాహకులు వినయ్ తదితరులు ఉన్నారు.