అనన్య న్యూస్, జడ్చర్ల: రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, తెలంగాణ కళాకారుడు తెలంగాణ ఉద్యమకారుడు సాయి చందు మరణం యావత్ తెలంగాణ జాతికే తీరని లోటు అని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం హైదరాబాదద్ లోని సాయిచంద్ నివాసం వద్ద ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎప్పుడు ఫోన్ చేసినా అన్నా అంటూ ఆప్యాయంగా పలకరించే ఓ కుటుంబ సభ్యున్ని కోల్పోయినట్లు ఉందని, మంచి భవిష్యత్తు ఉన్న నాయకుడిని తెలంగాణ సమాజం కోల్పోయిందని, సాయిచంద్ మరణ వార్తను జీర్ణించు కోలేక పోతున్నామన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో, పునర్నిర్మాణంలో సాయిచంద్ ఎంతో కీలకమన్నారు. సాయి చందు ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధర్యం ప్రసాదించాలని భగవంతుని ప్రార్థించారు.
Jadcherla: సాయి చంద్ పార్థివదేహానికి నివాళులు అర్పించిన.. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి..
RELATED ARTICLES